Gujarat Gas Leak: సూరత్‌లో ఘోర ప్రమాదం, కెమికల్ ట్యాంకర్ నుంచి విషవాయువులు లీక్, ఆరుగురు మృతి, మరికొందరికి తీవ్ర అస్వస్థత
గుజరాత్ సూరత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కెమికల్ ట్యాంకర్ నుంచి విషవాయువులు లీకవ్వడంతో ఆరుగురు మృతి చెందారు. సూరత్‌లోని సచిన్ జీఐడీసీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న ఓ కెమికల్ ట్యాంకర్ లీక్ కావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది
గుజరాత్ సూరత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కెమికల్ ట్యాంకర్ నుంచి విషవాయువులు లీకవ్వడంతో ఆరుగురు మృతి చెందారు. సూరత్‌లోని సచిన్ జీఐడీసీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న ఓ కెమికల్ ట్యాంకర్ లీక్ కావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ట్యాంకర్ కు 10 మీటర్ల దూరంలో ఉన్న విశ్వప్రేమ్ మిల్లో కార్మికులు ఈ పాయిజ్ గ్యాస్‌ను పీల్చడంతో క్షణాల్లో స్పృహ కోల్పోయారు. ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరికొందరు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. మిల్లులో కాస్త దూరంగా ఉన్నవాళ్లు ఆస్పత్రికి పోన్ చేయడంతో.. వెంటనే అవసరమైన వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Gujarat: Six people died and 20 others were admitted to the civil hospital after gas leakage at a company in Sachin GIDC area of Surat early morning today, says hospital's In Charge Superintendent, Dr Omkar Chaudhary pic.twitter.com/HVnH9CZHYl
— ANI (@ANI) January 6, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 06, 2022 11:25 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

