CDS General Bipin Rawat Dies: జనరల్ బిపిన్ రావత్ కన్నుమూత, ఆయన భార్య మధులికా రావత్ తో సహా 11 మంది ఘోర హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి, అధికారికంగా ప్రకటించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్

చీఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌ ప్రయణిస్తున్న హెలికాప్టర్‌ మరో పది నిమిషాల్లో ల్యాండ్‌ అవుతుందనగా ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో చీఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌ తో 12 మంది మరణించారు. వీరిలో ఆయన భార్య మధులికా రావత్ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారికంగా ట్వీట్ చేసింది.

CDS General Bipin Rawat Dies: జనరల్ బిపిన్ రావత్ కన్నుమూత, ఆయన భార్య మధులికా రావత్ తో సహా 11 మంది ఘోర హెలికాప్టర్‌  ప్రమాదంలో మృతి, అధికారికంగా ప్రకటించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్
Army chief General Bipin Rawat named India's first Chief of Defence Staff (Photo-ANI)

చీఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌ ప్రయణిస్తున్న హెలికాప్టర్‌ మరో పది నిమిషాల్లో ల్యాండ్‌ అవుతుందనగా ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో చీఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌ తో సహా 12 మంది మరణించారు. వీరిలో రావత్  భార్య మధులికా రావత్ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారికంగా ట్వీట్ చేసింది.

ఇదిలా ఉంటే బిపిన్‌ రావత్ ఆరేళ్ల కిందట ఓ హెలికాప్టర్ ప్రమాదం నుంచి బయటపడ్డారు. 2015లో ఆయన లెఫ్టినెంట్ జనరల్ హోదాలో ఉండగా, మరో ముగ్గురు ఆర్మీ సిబ్బందితో కలిసి నాగాలాండ్ లో చీటా హెలికాప్టర్ ఎక్కారు. ఫిబ్రవరి 3న ఆ హెలికాప్టర్ దిమాపూర్ జిల్లాలోని రగ్బాపహార్ హెలిప్యాడ్ నుంచి గాల్లోకి ఎగిసింది. అయితే టేకాఫ్ తీసుకున్న కొన్ని సెకన్లలోనే కూలిపోయింది. గాల్లో 20 అడుగుల ఎత్తుకు ఎగిరిన అనంతరం ఇంజిన్ నిలిచిపోవడంతో చీటా హెలికాప్టర్ కిందికిపడిపోయింది. ఈ ఘటనలో రావత్ కు స్వల్ప గాయాలు తగిలాయి. అయితే ఈ సారి మాత్రం ప్రమాదం నుంచి ఆయన బటయపడలేకపోయారు.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 08, 2021 06:18 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).