Covid in India: దేశంలో తాజాగా 56,211 మందికి కరోనా నిర్ధారణ, 271 మంది మృతితో 1,62,114 కు పెరిగిన మరణాలు, దేశంలో ప్రస్తుతం 5,40,720 యాక్టివ్ కేసులు
దేశంలో గత 24 గంటల్లో 56,211 మందికి కరోనా నిర్ధారణ అయింది. నిన్న 37,028 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,20,95,855కు (India Coronavirus) చేరింది.గడచిన 24 గంటల సమయంలో 271 మంది కరోనా కారణంగా మృతి (Covid Deaths) చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,62,114 కు పెరిగింది.
దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,13,93,021 మంది కోలుకున్నారు. 5,40,720 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 6,11,13,354 మందికి వ్యాక్సిన్లు (Coronavirus Vaccine) వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 24,26,50,025 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 7,85,864 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
ఇండియా కోవిడ్ రిపోర్ట్ :
India reports 56,211 new #COVID19 cases, 37,028 discharges, and 271 deaths in the last 24 hours, as per the Union Health Ministry.
Total cases: 1,20,95,855
Total recoveries: 1,13,93,021
Active cases:5,40,720
Death toll: 1,62,114
Total vaccination: 6,11,13,354 pic.twitter.com/Z8hFiTC4m4
— ANI (@ANI) March 30, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 30, 2021 10:51 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

