Covid in India: దేశంలో మళ్లీ కరోనా కల్లోలం, 50 వేలకు చేరువైన యాక్టివ్ కేసులు, గత 24 గంటల్లో 8,084 మందికి కరోనా, అత్యధికంగా కేరళలో 4319,మహారాష్ట్రలో 2946 కేసులు నమోదు
దేశంలో కొత్తగా 8,084 కరోనా కేసులు నమోదవ్వడంతో.. మొత్తం కేసులు 4,32,30,101కు చేరాయి. ఇందులో 4,26,57,335 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,771 మంది మరణించారు. మరో 47,995 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి
దేశంలో కొత్తగా 8,084 కరోనా కేసులు నమోదవ్వడంతో.. మొత్తం కేసులు 4,32,30,101కు చేరాయి. ఇందులో 4,26,57,335 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,771 మంది మరణించారు. మరో 47,995 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు 10 మంది మరణించగా, 4,592 మంది బాధితులు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 2946 కేసులు ఉన్నాయి. కేరళలో 4319, ఢిల్లీలో 735, కర్ణాటకలో 463, హర్యానాలో 304 చొప్పున నమోదయ్యాయి. ఇక యాక్టివ్ కేసులు 0.11 శాతానికి చేరాయి. రికవరీ రేటు 98.68 శాతం, మరణాలు 1.21 శాతంగా ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 3.24 శాతానికి చేరింది. ఇప్పటివరకు 1,95,19,81,150 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపింణీ చేశామని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆదివారం ఒక్కరోజే 11,77,146 మందికి వ్యాక్సినేషన్ చేశామని పేర్కొన్నది.
India reports 8,084 COVID19 cases and 10 deaths. Active cases rise to 47,995. Daily positivity 3.24% pic.twitter.com/hW2FQsIf17
— ANI (@ANI) June 13, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 13, 2022 11:06 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

