Jammu and Kashmir Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం, జమ్మూ కశ్మీర్‌లో లోయలో పడిన బస్సు, 32 మంది అక్కడికక్కడే దుర్మరణం, 22 మందికి తీవ్ర గాయాలు
జమ్మూ కశ్మీర్‌లో (Jammu And Kashmir) ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దోడా (Doda) జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో సుమారు 32 మంది ప్రాణాలు కోల్పోయారు. బటోట్-కిష్త్వార్ (Kishtwar) జాతీయ రహదారిపై ట్రుంగల్-అస్సార్ సమీపంలో (Assar region) బుధవారం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు జమ్మూ డివిజన్ కమిషనర్ రమేష్ కుమార్ తెలిపారు.
- Read in
- తెలుగు
జమ్మూ కశ్మీర్‌లో (Jammu And Kashmir) ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దోడా (Doda) జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో సుమారు 32 మంది ప్రాణాలు కోల్పోయారు. బటోట్-కిష్త్వార్ (Kishtwar) జాతీయ రహదారిపై ట్రుంగల్-అస్సార్ సమీపంలో (Assar region) బుధవారం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు జమ్మూ డివిజన్ కమిషనర్ రమేష్ కుమార్ తెలిపారు. బస్సు రోడ్డుపై నుంచి 300 అడుగుల లోతులో పడిపోయినట్లు చెప్పారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 55 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందం వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఇప్పటి వరకూ 25 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఘటనలో తీవ్రంగా గాయపడినవారిని దోడా, కిష్త్వార్ ప్రభుత్వ ఆసుపత్రులకు తరలిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు గాయపడిన వారిని తరలించేందుకు హెలికాప్టర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు.

Here's Videos
Tragic #BUS #accident at Assar near Trungal Assar in #Doda district. The bus was on the way from Kishtwar to Jammu.
At least 30 people died, Massive rescue operation underway. #JammuAndKashmir #kashmir #BusAccident #Kishtwar pic.twitter.com/BSKzsL4b8l
— Bharat Verma 🇮🇳 (@Imbharatverma) November 15, 2023
30 people feared dead in tragic bus accident in #Doda #Kashmir pic.twitter.com/aQrg8WaHgz
— Ashraf Wani اشرف وانی (@ashraf_wani) November 15, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 15, 2023 02:25 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

