Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో లోయలో పడిన బస్సు, 9 మంది మృతి, మరో 27 మందికి గాయాలు
జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ (Poonch) జిల్లాలోని బరేరి నల్లా వద్ద మినీబస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో 9 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. 36 మంది ప్రయాణికులతో కూడిన బస్సు.. పూంచ్ నుంచి గలీ మైదాన్ వెళ్తున్నది.
- Read in
- తెలుగు
జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ (Poonch) జిల్లాలోని బరేరి నల్లా వద్ద మినీబస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో 9 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. 36 మంది ప్రయాణికులతో కూడిన బస్సు.. పూంచ్ నుంచి గలీ మైదాన్ వెళ్తున్నది. ఈ క్రమంలో బరారి నల్లా సమీపంలో లోయలో పడిపోయిందని అధికారులు తెలిపారు. స్థానికులతో కలిసి పోలీసులు, సైనికులు సహాయక చర్యలు చేపట్టారని, గాయపడినవారిని ఆస్పత్రికి తరలించామని వెల్లడించారు. ఈ ప్రమాద ఘటనపై జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ నిన్హా దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు ఆర్థికసాయం ప్రకటించారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
Lt Governor of J&K, Manoj Sinha announces relief of Rs 5 lakh each for family members of the deceased. Also directs authorities to provide the best treatment to those injured. https://t.co/Ow5JYrfb2E pic.twitter.com/N7CAVcFYDB
— ANI (@ANI) September 14, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 14, 2022 12:49 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

