Kerala Accident: డ్రైవర్ నిర్లక్ష్యంతో కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టూరిస్ట్ బస్సు, తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి, పలువురుకి గాయాలు
కేరళలో డ్రైవర్ నిర్లక్ష్యంతో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాలక్కడ్ వడక్కన్‌చ్చెర్రి వద్ద కేరళ ఆర్టీసీ బస్సును ఓ టూరిస్ట్ బస్సు ఢీ కొట్టడంతో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో విద్యార్థులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది.
- Read in
- తెలుగు
కేరళలో డ్రైవర్ నిర్లక్ష్యంతో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాలక్కడ్ వడక్కన్‌చ్చెర్రి వద్ద కేరళ ఆర్టీసీ బస్సును ఓ టూరిస్ట్ బస్సు ఢీ కొట్టడంతో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో విద్యార్థులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. బేస్‌లియస్ స్కూల్‌కు చెందిన 10, 11, 12వ తరగతి విద్యార్థులను టూర్‌కు తీసుకెళ్లిన బస్సు.. ఓవర్ స్పీడ్‌తో ఓ కారును ఓవర్‌టేక్ చేయబోయే ప్రయత్నంలో అదుపు తప్పింది.
అంజుమూర్తీ మంగళం బస్టాప్ వద్ద ఓ ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ఆపై అదుపు తప్పి పక్కనే ఉన్న వాగులో పడి బోల్తా పడింది. టూరిస్ట్ బస్సులో 41 మంది చిన్నారులు, ఐదుగురు టీచర్లు, బస్సుకు సంబంధించి ఇద్దరు సిబ్బంది ఉన్నారు. ఇక ఆర్టీసీ బస్సులో 49 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. పన్నెండు మంది పరిస్థితి విషమంగా ఉందని, 28 మంది చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారని అధికారులు తెలిపారు.
🟥కేరళలో ఘోర రోడ్డుప్రమాదం
🟥ఆర్టీసీ బస్సు-టూరిస్టు బస్సు ఢీ
🟥9 మంది మృతి, 45 మందికి గాయాలు#Kerala #BusAccident pic.twitter.com/QdYLsctPkS
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) October 6, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 06, 2022 10:54 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

