Kuwait: భారత్ విమానాలపై నిషేధం విధించిన కువైట్, భారత్‌లో కరోనా పరిస్థితిని అంచనా వేసిన తర్వాత నిర్ణయం తీసుకున్నామని తెలిపిన అధికారులు
ఇండియా నుంచి వచ్చే అన్ని విమానాలపై నిషేధం విధిస్తున్నట్లు కువైట్ శనివారం తెలిపింది. నేరుగా భారత్ నుంచి వచ్చినా, ఇతర దేశాల మీదుగా వచ్చినా శనివారం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బ్యాన్ అమలులో ఉంటుందని కువైట్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్పష్టం చేసింది. ఇప్పటికే కెనడా, యూఏఈ, ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకోగా.. బ్రిటన్ రెడ్‌లిస్ట్‌లో పెట్టింది కువైట్ సైతం అదేబాట పట్టింది.
భారత్‌లో కరోనా పరిస్థితిని అంచనా వేసిన తర్వాత ఆరోగ్య అధికారుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. అయితే, కువైట్ పౌరులు, మొదటి డిగ్రీ బంధువులు (భర్త, భార్య, పిల్లలు), పని కార్మికులకు అనుమతి ఉంటుందని చెప్పింది. యూఏఈ నుంచి భారత్‌కు ప్రయాణికులకు వెళ్లేందుకు రెండుదేశాల మధ్య సర్వీసులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా నిషేధంతో సరుకు రవాణాపై ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పింది.
الطيران المدني : منع الرحلات التجارية المباشرة القادمة من الهند اعتبارا من السبت الموافق 2021/4/24 حتى اشعار آخر . pic.twitter.com/lJuhqo0ypS
— الطيران المدني (@Kuwait_DGCA) April 23, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 25, 2021 03:39 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

