Lalu Advice to Rahul Gandhi on Marriage: వీడియో ఇదిగో, రాహుల్ వెంటనే పెళ్లి చేసుకో, కనీసం మా మాటైన విను, యువనేతకు లాలూ ప్రసాద్ యాదవ్ సలహా
బీహార్ రాజధాని పాట్నాలో శుక్రవారం జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశంలో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్..రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన తెచ్చారు. పెళ్లి చేసుకో.. ఇంకా ఆలస్యం చేయవద్దు’ (get married) మేమంతా ఆ వేడుకలో పాల్గొంటాం’ అని లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు.
బీహార్ రాజధాని పాట్నాలో శుక్రవారం జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశంలో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్..రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన తెచ్చారు. పెళ్లి చేసుకో.. ఇంకా ఆలస్యం చేయవద్దు’ (get married) మేమంతా ఆ వేడుకలో పాల్గొంటాం’ అని లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. 53 ఏళ్ల రాహుల్ గాంధీ నవ్వుతూ దీనికి బదులిచ్చారు. ‘ఇప్పుడు మీరు దాని (పెళ్లి) గురించి చెప్పారు. ఇక అది జరుగుతుంది’ అని అన్నారు.
‘ఇంకా ఆలస్యం ఉందా? తన మాట వినడం లేదని మీ అమ్మగారు నాతో చెప్పారు’ అని లాలూ వ్యాఖ్యానించారు. ‘మా మాట విను.. పెళ్లి గురించి ఇప్పుడే స్పష్టత ఇవ్వు’ అని అన్నారు. పెళ్లి చేసుకోవాలని గతంలో తాను ఇచ్చిన సలహాను రాహుల్ గాంధీ పాటించలేదని లాలూ తెలిపారు. తన సలహా పాటించి ఉంటే ఈ పాటికి పెళ్లి చేసుకుని ఉండేవారని అన్నారు. పెళ్లిని ఇంకా ఆలస్యం చేయవద్దని రాహుల్ గాంధీకి సూచించారు. దీంతో ప్రతిపక్ష పార్టీల సమావేశంలో పాల్గొన్న నేతలంతా నవ్వుకున్నారు.
ANI Video
#WATCH | "You didn't listen to my advice earlier. You should have married. It is not too late even today. You must get married," says RJD leader Lalu Yadav to Rahul Gandhi during opposition leaders' press meet in Patna pic.twitter.com/T4HomIpZo5
— ANI (@ANI) June 23, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 23, 2023 09:03 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

