Accident In Maharastra: మహారాష్ట్ర రాయగడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు లోయలో పడి 13 మంది దుర్మరణం.. తీవ్రంగా గాయపడిన మరో 25 మంది.. పూణె-రాయగడ్ సరిహద్దులో ప్రమాదం.. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులు

మహారాష్ట్రలోని రాయగడ్‌ జిల్లాలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూణెలోని పింపుల్‌ గురవ్ నుంచి గోరేగావ్ వెళ్తున్న బస్సు ఉదయం 4.30 గంటల సమయంలో పూణె-రాయగడ్ సరిహద్దులో ప్రమాదానికి గురైంది.

Accident In Maharastra: మహారాష్ట్ర రాయగడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు లోయలో పడి 13 మంది దుర్మరణం..  తీవ్రంగా గాయపడిన మరో 25 మంది.. పూణె-రాయగడ్ సరిహద్దులో ప్రమాదం.. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులు
Credits: Twitter

Raigad, April 15: మహారాష్ట్రలోని (Maharastra) రాయగడ్‌ (Raigad) జిల్లాలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. పూణెలోని (Pune) పింపుల్‌ గురవ్ నుంచి గోరేగావ్ వెళ్తున్న బస్సు (Bus) ఉదయం 4.30 గంటల సమయంలో పూణె-రాయగడ్ సరిహద్దులో ప్రమాదానికి గురైంది. అదుపు తప్పిన బస్సు లోయలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు ప్రారంభించారు.

Rains In Telangana: రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు.. వాతావరణ శాఖ బులెటిన్

JEE Main Result 2023: 29న జేఈఈ మెయిన్ ఫలితాల విడుదల.. నేటితో ముగియనున్న చివరి విడత మెయిన్ పరీక్షలు

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Apr 15, 2023 09:06 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).