Maharashtra: జైల్లోనే కుప్పకూలిపోయిన మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్, ముంబైలోని జేజే హాస్పిటల్‌కు తరలించి చికిత్స చేస్తున్న వైద్యులు
మహారాష్ట్ర మాజీ హోంమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సీనియర్ నేత అనిల్ దేశ్‌ముఖ్.. ఈ మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురై జైల్లో కుప్పకూలారు. ఆర్థూర్ జైలు సిబ్బంది ఆయనను హుటాహుటిన ముంబైలోని జేజే హాస్పిటల్‌కు తరలించి చికిత్స చేయిస్తున్నారు.
మహారాష్ట్ర మాజీ హోంమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సీనియర్ నేత అనిల్ దేశ్‌ముఖ్.. ఈ మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురై జైల్లో కుప్పకూలారు. ఆర్థూర్ జైలు సిబ్బంది ఆయనను హుటాహుటిన ముంబైలోని జేజే హాస్పిటల్‌కు తరలించి చికిత్స చేయిస్తున్నారు.కాగా మనీలాండరింగ్ కేసులో గత ఏడాది నవంబర్ 2న అరెస్టైన విషయం విదితమే.
అనిల్ దేశ్‌ముఖ్ ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారని, ఛాతిలో నొప్పిగా ఉందని చెబుతూ కుప్పకూలి పోయారని జైలు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అనిల్ దేశ్‌ముఖ్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని వైద్యులు చెప్పారు. రక్తపోటు అధికంగా ఉందని చెప్పారు. చాతిలో నొప్పిగా ఉందని చెబుతుండటంతో అవసరమైన వైద్య పరీక్షలు చేసినట్లు వెల్లడించారు.
NCP leader Anil Deshmukh, who is currently lodged at the Arthur Road jail in Mumbai on corruption charges, collapsed after his health deteriorated. https://t.co/sOWQxY2LSr
— Financial Express (@FinancialXpress) August 26, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 26, 2022 07:11 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

