మహారాష్ట్రలోని థానే నగరంలోగల ఉల్హాస్‌నగర్ ఏరియాలో ఓ 12 ఏళ్ల బాలికను అన్న కిరాతకంగా చంపేశాడు. ఆ బాలిక పెద్ద మనిషి అయిన సమయంలో చెల్లెలి దుస్తులపై రక్తపు మరకలు చూసిన అన్న ఆమెను అనుమానించాడు. ఎవరితోనే శారీరకంగా కలవడంతోనే అలా జరిగిందని ఇంట్లో ఉన్న పట్టుకారు కాల్చి ఒళ్లంతా వాతలు పెట్టాడు. ముఖం, కాళ్లు, చేతులు, వీపు ఇలా ఎక్కడ పడితే అక్కడ కాల్చి చిత్రవధ చేశాడు. దాంతో బాలిక పరిస్థితి విషమించింది. దాంతో ఇరుగుపొరుగుతో కలిసి బాలికను ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే ఆ అభాగ్యురాలు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆ బాలిక చిన్న వయసులోనే కన్నవాళ్లను కోల్పోవడంతో అన్నావదినల దగ్గర ఉంటోంది.
Here's News Update
12-yr-old gets 1st period, brother kills her thinking blood is from intercourse in Thanehttps://t.co/K3Zvd80GsN
-via inshorts
— Amrita Bhinder 🇮🇳 (@amritabhinder) May 9, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)