Shark Bites Fisherman Legs: చేపలు పట్టేందుకు నదిలోకి దిగిన వ్యక్తి కుడి కాలు కొరికేసిన షార్క్, సోషల్ మీడియాలో వీడియో వైరల్..

మహారాష్ట్రలోని పాల్ఘడ్‌ జిల్లాలో చేపలు పట్టేందుకు నదిలోకి దిగిన ఓ వ్యక్తిని భయంకరమైన షార్క్‌ చేప కాలు కొరికింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటనతో ఆగ్రహించిన మత్స్యకారులు వలతో ఆ షార్క్‌ను పట్టి ఒడ్డుకు తీసుకువచ్చి చంపేశారు.

Shark Bites Fisherman Legs: చేపలు పట్టేందుకు నదిలోకి దిగిన వ్యక్తి కుడి కాలు కొరికేసిన షార్క్, సోషల్ మీడియాలో వీడియో వైరల్..
Maharashtra Man Enters River For Fishing, Shark Bites His Right Leg (Photo-Video Grab)

మహారాష్ట్రలోని పాల్ఘడ్‌ జిల్లాలో చేపలు పట్టేందుకు నదిలోకి దిగిన ఓ వ్యక్తిని భయంకరమైన షార్క్‌ చేప కాలు కొరికింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటనతో ఆగ్రహించిన మత్స్యకారులు వలతో ఆ షార్క్‌ను పట్టి ఒడ్డుకు తీసుకువచ్చి చంపేశారు. వీడియో ప్రకారం.. అరేబియా సముద్రంలోకి పారే వైతరుణి నదిలో చేపలు పట్టేందుకు 32 ఏళ్ల విక్కీ సురేష్ గోవారి దిగాడు.

అయితే ఆ నదిలో ఉన్న షార్క్‌ అతడి కుడి కాలుపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడి రక్తం ధారంగా కారడంతో అతడు అచేతనంగా పడిపోయాడు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నదిలో షార్క్‌ తిరగడం చూసి స్థానికులు వలలతో ఒక షార్క్‌ను బంధించి ఒడ్డుకు తెచ్చి చంపారు. ఈ వీడియోతో పాటు నదిలో తిరుగుతున్న షార్క్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 14, 2024 08:20 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).