Maharashtra Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం, ప్రైవేటు బస్సు కిందకు దూసుకెళ్లిన కారు, అయిదు మంది అక్కడికక్కడే మృతి, మరొకరి పరిస్థితి విషమం
మహారాష్ట్రలోని (Maharashtra) చంద్రాపూర్ (Chandrapur) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చంద్రాపూర్ జిల్లాలోని కాన్పా (Kanpa Village) సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
మహారాష్ట్రలోని (Maharashtra) చంద్రాపూర్ (Chandrapur) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చంద్రాపూర్ జిల్లాలోని కాన్పా (Kanpa Village) సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్నఅయిదు మంది అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు.కారు నాగ్‌పూర్ (Nagpur) నుంచి నాగ్‌భీడ్‌కు (Nagbheed) వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జు అయిందని చెప్పారు. గాయపడినవారిలో మహిళతోపాటు చిన్నారి ఉందన్నారు.
News
Maharashtra Road Accident: Five Dead As Car Collides With Bus in Chandrapur, Pics of Horrific Crash Emerge #Maharashtra #Chandrapur #RoadAccident https://t.co/yU562pufMq
— LatestLY (@latestly) June 4, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 05, 2023 11:10 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

