Medak Road Accident: మెదక్ జిల్లా రోడ్డు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
మెదక్ జిల్లా శివంపేట పీఎస్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉసిరికపల్లి-వెల్దుర్తి రహదారిలో కారు అతివేగంగా రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టి వాగులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మెదక్ జిల్లా శివంపేట పీఎస్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉసిరికపల్లి-వెల్దుర్తి రహదారిలో కారు అతివేగంగా రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టి వాగులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు బాలికలు ఉన్నారు. మృతులు పాము బండ తండాకు చెందిన వారికిగా గుర్తించారు. ఈ ఘటనలో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మెదక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఏడుగురి ప్రాణాలు తీసిన రోడ్డుపై ఉన్న గుంత, ఇందులో ముగ్గురు చిన్నారులు
మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఈ రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Here's Accident Video
ఏడుగురి ప్రాణాలు తీసిన రోడ్డుపై ఉన్న గుంత
మెదక్ జిల్లా శివంపేట మండలం రత్నాపూర్ దగ్గర రోడ్డుపై ఓ గుంత ఏర్పడింది.
వేగంగా వెళ్లిన ఓ కారు ఆ గుంతలో పడి ఎగిరి చెట్టును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోగా అందులో ముగ్గురు చిన్నారులు ఉన్నారు...#State360Telugu #Telangana pic.twitter.com/yPFUsUyULk
— State 360 Telugu (@State360Telugu) October 16, 2024
మెదక్ జిల్లా శివంపేట మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి..
ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమన్న సీఎం..
బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన రేవంత్.. https://t.co/cIh6zsEds0 pic.twitter.com/zbL4qeN3bW
— News Line Telugu (@NewsLineTelugu) October 16, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 16, 2024 08:05 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

