NaMo Bharat Inaugurated: వీడియో ఇదిగో, పట్టాలపై పరుగులు పెట్టిన నమో భారత్ సెమీ హైస్పీడ్ రైలు, ర్యాపిడ్‌ఎక్స్ రైలుకు జెండా ఊపిన ప్రధాని మోదీ
దేశీయ తొలి ప్రాంతీయ సెమీ హైస్పీడ్ రైలు ‘నమో భారత్ (Namo Bharat)’ పట్టాలపైకి చేరింది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని సాహిబాబాద్ స్టేషన్‌లో దిల్లీ-గాజియాబాద్-మేరఠ్ రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRTS) కారిడార్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) శుక్రవారం ప్రారంభించారు
దేశీయ తొలి ప్రాంతీయ సెమీ హైస్పీడ్ రైలు ‘నమో భారత్ (Namo Bharat)’ పట్టాలపైకి చేరింది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని సాహిబాబాద్ స్టేషన్‌లో దిల్లీ-గాజియాబాద్-మేరఠ్ రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRTS) కారిడార్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) శుక్రవారం ప్రారంభించారు. అనంతరం తొలి ర్యాపిడ్‌ఎక్స్ (RapidX) రైలుకు ప్రధాని జెండా ఊపారు. ఈ కార్యక్రమంలో యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రి హర్‌దీప్ సింగ్ పురి తదితరులు పాల్గొన్నారు.
రైలును ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ అందులో ప్రయాణించారు. స్కూల్ విద్యార్థులు, ర్యాపిడ్‌ఎక్స్ రైలు సిబ్బందితో ముచ్చటించారు. గంటకు 180 కి.మీ.గరిష్ఠ వేగంతో దూసుకెళ్లేలా తీర్చిదిద్దిన ఈ రైలులో అధునాతన సదుపాయాలు ఉంటాయి.

Here's ANI Video
#WATCH | Sahibabad, Uttar Pradesh | Prime Minister Narendra Modi flags off the RapidX train connecting Sahibabad to Duhai depot, marking the launch of Regional Rapid Transit System (RRTS) in India. This is India’s first RapidX train which will be known as NaMo Bharat. pic.twitter.com/YaanYmocB8
— ANI (@ANI) October 20, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 20, 2023 12:35 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

