PM Modi on Mahatma Gandhi: వీడియో ఇదిగో, 1982 వరకు మహాత్మాగాంధీ ఎవరో ప్రపంచానికి తెలియదు, ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు
స్వాతంత్య్ర సమరయోధుడు జాతిపిత మహాత్మాగాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహాత్మాగాంధీపై 1982లో సినిమా తీసే వరకు ఆయనెవరో ప్రపంచానికి తెలియదని వ్యాఖ్యానించారు.ఏబీపీ న్యూస్ చానెల్‌కు మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు
- Read in
- తెలుగు
స్వాతంత్య్ర సమరయోధుడు జాతిపిత మహాత్మాగాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహాత్మాగాంధీపై 1982లో సినిమా తీసే వరకు ఆయనెవరో ప్రపంచానికి తెలియదని వ్యాఖ్యానించారు.ఏబీపీ న్యూస్ చానెల్‌కు మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘గాంధీజీ చాలా గొప్ప వ్యక్తి. కానీ ఆయన గురించి ఎవరికీ తెలియదని చెబుతున్నందుకు నన్ను క్షమించండి. 1982లో ఆయనపై సినిమా తీసే వరకు గాంధీ గురించి ప్రపంచానికి తెలియదన్నారు. దేవుడే నన్ను ఇక్కడకు పంపించాడు, ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు, జీవశాస్త్రపరంగా నేను పుట్టలేదని చెప్పిన వీడియో వైరల్
సినిమా తర్వాత అతను ఎవరనే విషయాన్ని తెలుసుకొనేందుకు ప్రపంచం ఆసక్తి చూపింది. చేయాల్సిన పని మనం చేయలేదు. మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా గురించి ప్రపంచానికి తెలిస్తే, మహాత్మా గాంధీ కూడా వారికంటే తక్కువేమీ కాదు. ఈ విషయాన్ని అందరూ అంగీకరించాలి’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మహాత్మా గాంధీ జీవితం ఆధారంగా 1982లో ‘గాంధీ’ పేరుతో ఓ చిత్రం వచ్చింది. దీనికి రిచర్డ్ అటెన్‌బరో దర్శకత్వం వహించారు.
Here's Video
गांधी फिल्म आने से पहले दुनिया में महात्मा गांधी को कोई नहीं जानता था।
- नरेंद्र मोदी pic.twitter.com/bX1nwdJ6H8
— Govind Pratap Singh | GPS (@govindprataps12) May 29, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 30, 2024 01:39 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

