ఉత్తరప్రదేశ్ కు సంబంధించి ఓ భయానక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నోయిడాలోని జెవార్‌లో ఓ యువకుడు మద్యం మత్తులో విద్యుత్తు టవర్‌పైకి ఎక్కుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే ఆ యువకుడు టవర్ ఎక్కుతూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. అక్కడి నుంచి కిందకు జారి ట్రాన్స్‌ఫార్మర్‌పై పడిపోయాడు. స్థానిక సమాచారం ప్రకారం, సంఘటన జరిగినప్పుడు యువకుడు మద్యం మత్తులో ఉన్నాడు. బాధితుడిని నౌషాద్‌గా గుర్తించారు. స్థానిక ఆస్పత్రికి తరలించగా అక్కడి నుంచి ఢిల్లీలోని సఫాదర్‌జంగ్‌ ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం బాధితుడు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. షాకింగ్ వీడియో ఇదిగో, వెనక నుంచి వచ్చి మహిళ గొంతు కోసి డబ్బులు దోచుకెళ్లిన దొంగ, ఢిల్లీలో ఒళ్లుగగుర్పొడిచే ఘటన

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)