Andhra Pradesh Politics: వీడియో ఇదిగో, వల్లభనేని వంశీ అనుచరులు అరెస్ట్, టీడీపీ నేత రంగబాడుపై ఎలైట్ హోటల్ వద్ద దాడికి పాల్పడిన కేసులో అదుపులోకి..
గత ఎన్నికలకు ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరిన రంగబాబుపై వంశీ అనుచరులు గన్నవరం సమీపంలోని పార్క్ ఎలైట్ హోటల్ వద్ద దాడికి పాల్పడ్డారు.ఈ ఘటనలో రంగబాబుకు గాయాలయ్యాయి. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.పొలం విషయమై మాట్లాడేందుకు పిలిచి దాడి చేశారని ఫిర్యాదులో రంగబాబు పేర్కొన్నారు
వైసీపీ సీనియర్ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ( Vallabhaneni Vamsi) ముఖ్య అనుచరులు ఆరుగురుని గన్నవరం పోలీసులు నేడు అరెస్ట్ చేశారు. ఓలుపల్లి మోహన్ రంగ, భీమవరపు యతేంద్ర రామకృష్ణ (రాము), అనగాని రవి, మేచినేని వెంకటేశ్వరరావు (బాబు), గుర్రం అంజయ్య(నాని) గోనూరి సీనయ్యలను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు ప్రదేశాల్లో ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులో తీసుకుని కంకిపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
గత ఎన్నికలకు ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరిన రంగబాబుపై వంశీ అనుచరులు గన్నవరం సమీపంలోని పార్క్ ఎలైట్ హోటల్ వద్ద దాడికి పాల్పడ్డారు.ఈ ఘటనలో రంగబాబుకు గాయాలయ్యాయి. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.పొలం విషయమై మాట్లాడేందుకు పిలిచి దాడి చేశారని ఫిర్యాదులో రంగబాబు పేర్కొన్నారు. తాజాగా ఈ కేసు విచారణలో కదలిక వచ్చింది. నిందితులను అరెస్ట్ చేసి కంకిపాడు పీఎస్‌కు తరలించి విచారిస్తున్నారు.
police arrested main followers of former Gannavaram MLA
*కృష్ణాజిల్లా,గన్నవరం నియోజకవర్గం.
టిడిపి నాయకుడు రంగబాబు పై దాడి కేసులో వైసీపీ నాయకులు అరెస్ట్.
గతంలో పార్క్ ఎలైట్ హోటల్ వద్ద టిడిపి నాయకుడు పై దాడి చేసిన కొంత మంది వ్యక్తులు.
దాడికి సంబంధించి సూత్రధారులు వైసిపి నాయకులగా గుర్తించిన పోలీసులు.
తెల్లవారుజాము నుండి వైసిపి… pic.twitter.com/tPDL87uIoo
— Aadhan Telugu (@AadhanTelugu) November 19, 2024
గతంలో పార్క్ ఎలైట్ హోటల్ వద్ద దాడికి సంబంధించిన సూత్రధారులను వైసీపీ నాయకులుగా గుర్తించిన పోలీసులు. ఈ రోజు ఉదయం వైసీపీ నాయకులను అదుపులోకి తీసుకుని కంకిపాడు పోలీస్ స్టేషన్‌కి తరలింపు. అదుపులోకి తీసుకున్న వాళ్లలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్య అనుచరులు... pic.twitter.com/EZqpuLUcW2
— Aadhan Telugu (@AadhanTelugu) November 19, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 19, 2024 02:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

