Employee Steal From Jewellery Shop: జనవరి 1న (సోమవారం) ఆదివారం Puneలోని రాజ్ కాస్టింగ్ షాపులో ఉద్యోగి రూ.3.32 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.10 లక్షల నగదు అపహరించి పరారైన ఘటన వెలుగుచూసింది. నగల వ్యాపారి దీపక్ నేతాజీ మానే ఫరస్ఖానా పోలీస్ స్టేషన్‌లో దొంగతనం గురించి ఫిర్యాదు చేశాడు, ఆ తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది.
ఏడేళ్లుగా పూణె నగల వ్యాపారంలో ప్రముఖుడిగా కొనసాగుతున్న మానే తన ఫిర్యాదులో దొంగతనం గురించి వెల్లడించాడు. చోరీకి గురైన వాటిలో 5 కిలోల 323 గ్రాముల బంగారు ఆభరణాలు.. వాటి మొత్తం విలువ రూ.3 కోట్ల 32 లక్షల 9 వేల 228 ఉంది. అలాగే రూ.10 లక్షల 93 వేల 260 నగదు కూడా మాయమయిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డవ్వగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Here's Video
#Pune: Employee Makes Off with Gold Ornaments Worth Rs 3.32 Crore and Rs 10 Lakh in Cash From Jewellery Shop, Watch Video pic.twitter.com/nOj1wsqiYd
— Punekar News (@punekarnews) January 2, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)