Farmers Protest: పంజాబ్ రైతులు మళ్లీ పోరుబాట, తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ మూడు రోజుల రైల్ రోకో ఆందోళన, వీడియో ఇదిగో..
తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ పంజాబ్ రైతులు మళ్లీ పోరుబాట పట్టారు. మూడు రోజుల రైల్ రోకో (Rail Roko) ఆందోళనలో భాగంగా రైతులు రైల్ ట్రాక్‌లపైకి చేరి నిరసన తెలపడంతో ఫిరోజ్‌పూర్ డివిజన్‌లో 18 రైళ్లు నిలిచిపోయాయి.
తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ పంజాబ్ రైతులు మళ్లీ పోరుబాట పట్టారు. మూడు రోజుల రైల్ రోకో (Rail Roko) ఆందోళనలో భాగంగా రైతులు రైల్ ట్రాక్‌లపైకి చేరి నిరసన తెలపడంతో ఫిరోజ్‌పూర్ డివిజన్‌లో 18 రైళ్లు నిలిచిపోయాయి. వరదల్లో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఆర్ధిక సాయం ప్రకటించడంతో పాటు, గిట్టుబాటు ధరకు చట్టబద్ధత కల్పించడం, రుణ మాఫీ వంటి పలు డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ కిసాన్ మజ్ధూర్ సంఘర్ష్ కమిటీ నేతృత్వంలో పలు రైతు సంఘాలు మూడు రోజుల పాటు రైల్ రోకోకు పిలుపు ఇచ్చాయి.
2021లో లఖింపూర్ ఖేరి ఘటనలో ప్రధాన నిందితుడు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తేని కుమారుడు ఆశిష్ మిశ్రాపై చర్యలు చేపట్టాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. పంజాబ్ రైతులకు అన్యాయం చేయాలని ఎవరైనా తలపెడితే పంజాబ్ రైతులకు హరియాణ రైతులు కూడా బాసటగా నిలుస్తారని కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీకి చెందిన శర్వన్ సింగ్ పంధేర్ వెల్లడించారు.
Here's Video
#WATCH | Punjab | Farmers, under the aegis of Kisan Mazdoor Sangharsh Committee, sit on railway tracks as they stage a 'Rail Roko Andolan' over their demands, including Committee for MSP, withdrawal of cases regarding agitation in Delhi and compensation & jobs for families of… pic.twitter.com/fy9t6XieHH
— ANI (@ANI) September 28, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 28, 2023 08:42 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

