Supreme Court: సుప్రీంకోర్టు నూతన జడ్జీలుగా 5గురు ప్రమాణ స్వీకారం, తాజా నియామకంతో 27 నుంచి 32కు పెరగనున్న న్యాయమూర్తలు సంఖ్య

రాజస్థాన్, పాట్నా, మణిపూర్‌ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్, జస్టిస్‌ సంజయ్‌ కరోల్, జస్టిస్‌ పీవీ సంజయ్‌ కుమార్, పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అహసనుద్దీన్‌ అమానుల్లా, అలహాబాద్‌ హైకోర్టు జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

Supreme Court: సుప్రీంకోర్టు నూతన జడ్జీలుగా 5గురు ప్రమాణ స్వీకారం, తాజా నియామకంతో 27 నుంచి 32కు పెరగనున్న న్యాయమూర్తలు సంఖ్య
Supreme Court gets five new judges, Chief Justice of India administers oath of office (Photo-ANI)

సుప్రీంకోర్టు కొత్త న్యాయమూర్తులుగా నియమితులైన ఐదుగురు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజస్థాన్, పాట్నా, మణిపూర్‌ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్, జస్టిస్‌ సంజయ్‌ కరోల్, జస్టిస్‌ పీవీ సంజయ్‌ కుమార్, పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అహసనుద్దీన్‌ అమానుల్లా, అలహాబాద్‌ హైకోర్టు జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ నియామకంతో సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య సీజేఐతో కలిపి ప్రస్తుతమున్న 27 నుంచి 32కు చేరనుంది. అత్యున్నత న్యాయస్థానంలో వాస్తవంగా 34 మంది జడ్జీలు ఉండాల్సింది.న్యాయమూర్తుల నియామకం, బదిలీలకు సంబంధించి కొలీజియం సిఫారసులకు ఆమోదం తెలపడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుండటంపై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

Here's ANI Tweet

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 06, 2023 12:42 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).