తమిళనాడులో లిఫ్ట్ ఇస్తాన‌ని చెప్పి మైన‌ర్ బాలుడిపై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డిన బీజేపీ కార్య‌క‌ర్త‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విల్లివాక్కం జిల్లాలో బాలుడిని బైక్‌పై ఎక్కించుకున్న బీజేపీ పార్టీ కార్య‌క‌ర్త బాల‌చంద్ర‌న్ (47) పాడి బ్రిడ్జి కింద నిర్మానుష్య ప్ర‌దేశానికి తీసుకువెళ్లి బాలుడిని లైంగిక వేధింపుల‌కు గురిచేశాడు.

బైక్‌పై నుంచి దిగిన త‌ర్వాత బాలుడు ఏడుస్తుండ‌గా స్ధానికులు ప్ర‌శ్నించ‌డంతో ఈ వ్య‌వ‌హారం వెలుగుచూసింది. బాల‌చంద్ర‌న్‌ను ప‌ట్టుకున్న స్ధానికులు అత‌డిని నిల‌దీయ‌గా పారిపోయేందుకు ప్ర‌య‌త్నించాడు. నిందితుడి వాహ‌నంలో పార్టీ జెండా, ఐడీ కార్డు ల‌భ్య‌మ‌య్యాయి. బాలుడి త‌ల్లి ఫిర్యాదుతో బాల‌చంద్ర‌న్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు న‌మోదు చేసి త‌దుప‌రి ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు.

News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)