నిర్మల్ జిల్లాలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మొసళ్లలోడుతో వెళ్తున్న లారీ బోల్తా కొట్టడంతో, మొసళ్లు రోడ్డుపై పడిపోయాయి. మామడ మండలంలోని మొండిగుట్ట సమీపంలో 44 జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటనలో, డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. మామడ మండలంలో గురువారం ఉదయం 44 జాతీయ రహదారిపై ఒక లారీ బోల్తా కొట్టింది.

రైతు బతుకు ఇంతేనా, ఏడాదిపాటు కష్టపడి పండించిన పంటంతా నేలపాలు, వాగుపై సరైన వంతెన లేకపోవడంతో వరిబస్తాలతో వెళుతున్న ట్రాక్టర్ బోల్తా

ఈ లారీ బీహార్ జిల్లా పాట్నాలోని సంజయ్ గాంధీ బయోలా జికల్ పార్కు నుంచి బెంగుళూరులోని బానర్ గట్స్ బయోలాజికల్ పార్కుకు ఎనిమిది మొసళ్లను తరలిస్తున్న సమయంలో ప్రమాదానికి గురైంది.లారీ బోల్తా కొట్టిన సమయంలో రెండు మొసళ్లు రోడ్డుపైకి రావడంతో వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు మొసళ్ల సంరక్షణ చర్యలు చేపట్టారు.డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

lorry loaded with crocodiles overturned

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)