Hori Habba Bull Race Tragedy: ఎడ్ల రేసులో తీవ్ర విషాదం, హోరీ హబ్బా ఈవెంట్‌లో ఇద్దరు వ్యక్తులు మృతి, ఎడ్ల రేసులు నిర్వహించేందుకు నిర్వాహకులు అనుమతి తీసుకోలేదని తెలిపిన పోలీసులు
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో జరిగిన ఎడ్ల రేసులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రెండు వేర్వేరు హోరీ హబ్బా అనే ఎడ్ల రేసులో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. శివమొగ్గ జిల్లాలోని షికారిపుర, జాడే గ్రామంలో ఈ ఘటనలు జరిగాయి.
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో జరిగిన ఎడ్ల రేసులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రెండు వేర్వేరు హోరీ హబ్బా అనే ఎడ్ల రేసులో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. శివమొగ్గ జిల్లాలోని షికారిపుర, జాడే గ్రామంలో ఈ ఘటనలు జరిగాయి. మృతులు షికారిపురకు చెందిన ప్రశాంత్, సొరబా తాలూకాలోని జాడే గ్రామానికి చెందిన ఆదిగా గుర్తించారు.దీపావళి తర్వాత జరిపే హోరీ హబ్బా ఈవెంట్‌లో భాగంగా ఎడ్ల పందేలు నిర్వహిస్తారు.
అయితే ఎడ్ల రేసులు నిర్వహించేందుకు నిర్వాహకులు అనుమతి తీసుకోలేదని శివమొగ్గ ఎస్పీ మిథున్ కుమార్ చెప్పారు. రెండు సంఘటనల గురించి పోలీసులకు ఎటువంటి సమాచారం లేదన్నారు. ఈ విషయంపై విచారణ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. పోలీసులు అవసరమైన చర్యలు తీసుకుంటారని కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర అన్నారు.
In two separate incidents, two people were gored to death by bulls in #Karnataka’s Shivamogga district.@sagayrajp https://t.co/uLJMakCPKT
— IndiaToday (@IndiaToday) October 30, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 31, 2022 11:04 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

