Telangana Road Accident: వీడియో ఇదిగో, రెండు కాలేజీ బస్సుల ఢీ, ఒకరి మృతి, 20 మంది విద్యార్థులకు గాయాలు

తెలంగాణలో రెండు కాలేజీ బస్సులు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఈ ఘటన జరిగింది. బస్సులు రెండూ బీవీ రాజు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీవీఆర్ఐటీ)కి చెందినవే కావడం గమనార్హం. నగర శివారులోని క్లాసిక్ గార్డెన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

Telangana Road Accident: వీడియో ఇదిగో, రెండు కాలేజీ బస్సుల ఢీ, ఒకరి మృతి, 20 మంది విద్యార్థులకు గాయాలు
Two college buses collided near Narsapur in Medak district one Dies Several Injured

తెలంగాణలో రెండు కాలేజీ బస్సులు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఈ ఘటన జరిగింది. బస్సులు రెండూ బీవీ రాజు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీవీఆర్ఐటీ)కి చెందినవే కావడం గమనార్హం. నగర శివారులోని క్లాసిక్ గార్డెన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

రెండు బస్సుల డ్రైవర్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. క్యాబిన్‌లో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసేందుకు పోలీసులు, స్థానికులు ఎంతగానో కష్టపడాల్సి వచ్చింది. వారిని వెంటనే నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. అతడిని పటాన్‌చెరుకు చెందిన నాగరాజుగా గుర్తించారు. మరో డ్రైవర్ యాదగిరి పరిస్థితి విషమంగా ఉంది. రెండు బస్సుల్లోని దాదాపు 20 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయాల నుంచి రక్తం కారుతున్న విద్యార్థులను అంబులెన్సుల్లో హైదరాబాద్, నర్సాపూర్, సంగారెడ్డి ఆసుపత్రులకు తరలించారు.

షాకింగ్ వీడియో, వాగు దాటేందుకు బాలింత కష్టాలు, భుజంపై మోసి పెద్దేరు వాగును దాటించిన కుటుంబ స‌భ్యులు

ఆటోరిక్షాను తప్పించే ప్రయత్నంలో ఓ డ్రైవర్ బస్సును పక్కకి తిప్పడంతో మరో బస్సును ఢీకొట్టినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనతో నర్సాపూర్-సంగారెడ్డి రహదారిపై నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు జేసీబీలతో బస్సులను అక్కడి నుంచి తొలగించారు.

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 27, 2024 04:48 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).