Udhayanidhi Stalin: మాపై హిందీని రుద్దటాన్ని ఆపండి, హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన ఉదయనిధి స్టాలిన్
హిందీపై అమిత్ షా మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారని, హిందీ మాత్రమే గొప్ప భాష అనే ఆలోచనను బీజేపీ విడనాడాలని హితవు పలికారు. తమిళనాడు రాష్ట్రంలో తమిళం మాట్లాడతారు, కేరళలో మలయాళం మాట్లాడతారు... ఈ రెండు రాష్ట్రాలను హిందీ కలుపుతుందా, సాధికారత ఎక్కడి నుంచి వస్తుంది? అని ఉదయనిధి ప్రశ్నించారు.
- Read in
- తెలుగు
హిందీ దివస్ (హిందీ భాషా దినోత్సవం) సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. భారతదేశంలోని వైవిధ్యాన్ని హిందీ ఏకం చేస్తుందని, హిందీ ఏ భాషతోనూ పోటీపడదని అమిత్ షా అన్నారు. దేశ ప్రజలను ఏకం చేసే మార్గం హిందీ భాష అని పేర్కొన్నారు.దీనిపై ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. ఓ నాలుగైదు రాష్ట్రాల్లో మాట్లాడే భాష దేశాన్ని ఏకం చేస్తుందా? అని ప్రశ్నించారు.
హిందీపై అమిత్ షా మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారని, హిందీ మాత్రమే గొప్ప భాష అనే ఆలోచనను బీజేపీ విడనాడాలని హితవు పలికారు. తమిళనాడు రాష్ట్రంలో తమిళం మాట్లాడతారు, కేరళలో మలయాళం మాట్లాడతారు... ఈ రెండు రాష్ట్రాలను హిందీ కలుపుతుందా, సాధికారత ఎక్కడి నుంచి వస్తుంది? అని ఉదయనిధి ప్రశ్నించారు. హిందీ వల్లే అభివృద్ధి సాధ్యం అనేలా మాట్లాడడం సరికాదని హితవు పలికారు.సనాతన ధర్మం ఓ మహమ్మారి వంటిదని, దాన్ని నిర్మూలించకపోతే చాలా ప్రమాదమని ఉదయనిధి వ్యాఖ్యానించిన సంగతి విదితమే.

Here's Tweet
I strongly condemn the statement of Union Home Minister Amit Shah claiming that Hindi is the uniting force of India and it is empowering other regional languages.
Hindi is spoken only in four or five states in the Country and hence the statement of Amit Shah is totally absurd.…
— Udhay (@Udhaystalin) September 14, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 14, 2023 06:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

