UP Horror: వీడియో ఇదిగో, తమతో కలిసి మందు తాగలేదని స్నేహితుడిని మేడపై నుంచి తోసిన స్నేహితులు, కిందపడి దెబ్బలు తగిలినా వదలకుండా పాశవిక దాడి
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో కలిసి మందుకొట్టేందుకు నిరాకరించాడన్న కోపంతో రంజీత్ సింగ్ అనే యువకుడిని అతని స్నేహితుడు మేడ పైనుంచి కిందకు తోసేశాడు. అంతటితో ఆగకుండా కిందపడ్డ బాధితుడిపై అక్కడే ఉన్న మిగిలిన స్నేహితులు పాశవికంగా దాడి చేశారు.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో కలిసి మందుకొట్టేందుకు నిరాకరించాడన్న కోపంతో రంజీత్ సింగ్ అనే యువకుడిని అతని స్నేహితుడు మేడ పైనుంచి కిందకు తోసేశాడు. అంతటితో ఆగకుండా కిందపడ్డ బాధితుడిపై అక్కడే ఉన్న మిగిలిన స్నేహితులు పాశవికంగా దాడి చేశారు. లక్నోలోని రుప్పూర్ ఖాద్రా ప్రాంతంలో ఈ ఉదంతం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో బాధితుడి ఇంటికి ఎదురుగా ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. వేయి రూపాయల బిర్యానీ తిన్నందుకు రూ. లక్ష రూపాయలు ఆస్పత్రి బిల్లు, రక్తపు వాంతులతో ఆస్పత్రి పాలైన హైదరాబాద్ వాసి, వీడియో ఇదిగో..
ఆ వీడియోలో ఇద్దరు యువకులు డాబాపై పెనుగులాడుతుండగా మరో యువకుడు పక్క నుంచి డాబా ఎక్కుతుండటం కనిపించింది. అనంతరం పిట్టగోడను గట్టిగా పట్టుకున్న రంజీత్ ను మరో యువకుడు అమాంతం పైకెత్తి కింద పడేయడం అందులో రికార్డయింది.రంజీత్ ను స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఒకే అంతస్తుగల ఇంటి పైనుంచి పడినందున అతనికి ప్రాణాపాయం తప్పింది. చికిత్స అనంతరం వైద్యులు అతన్ని డిశ్చార్జి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దాడికి పాల్పడిన నలుగురు నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న నాలుగో నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Here's Video
మందు తాగలేదని వ్యక్తిని డాబాపై నుంచి తోసేసి కొట్టారు
ఉత్తరప్రదేశ్ - లక్నోలో రంజిత్ సింగ్ అనే వ్యక్తి మద్యం అమ్మేవాడు.. ఇదే క్రమంలో 24వ తేదీ రాత్రిపూట మందు తాగడానికి వచ్చిన నలుగురు వ్యక్తులు రంజిత్ సింగ్ను కూడా మందు తాగమన్నారు.
దీనికి రంజిత్ సింగ్ నిరాకరించి వాళ్ళని డాబాపై… pic.twitter.com/zslJXBDenm
— Telugu Scribe (@TeluguScribe) May 28, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 28, 2024 05:16 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

