పోలీస్ అధికారి టికెట్ కొనుగోలు చేయకుండా ఏకంగా వందే భారత్ రైలులో ప్రయాణించాడు. గమనించిన ఒక ప్రయాణికుడు టికెట్ ట్రావెలింగ్ ఎగ్జామినర్ (టీటీఈ)కు ఈ విషయం చెప్పాడు. దీంతో ఆ పోలీస్‌ను టీటీఈ నిలదీశాడు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. టికెట్ లేకుండా రైలులో ప్రయాణించడం శిక్షార్హమైన నేరమని తెలిసినా వందే భారత్ రైలులో ఎందుకు ఎక్కారని ప్రశ్నించాడు. టికెట్ లేకపోతే బస్సులో వెళ్లాలని సూచించాడు. దీంతో ఆ పోలీస్ అధికారి టీటీఈకి నచ్చజెప్పేందుకు ప్రయత్నించాడు.ఒక ప్రయాణికుడు తన మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Here's Video
जब बिना टिकट वंदे भारत में चढ़ गया UP पुलिस का जवान
देखिये TTE ने फिर क्या किया pic.twitter.com/8BreKPUtK5
— FirstBiharJharkhand (@firstbiharnews) October 9, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)