Hathras Stampede: హత్రాస్‌లో మతపరమైన కార్యక్రమంలో తొక్కిసలాట, 27 మంది మృతి, వందమందికి పైగా గాయాలు, మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని హత్రాస్ (Hathras)లో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో తొక్కిసలాట (Stampede) జరిగింది. రతీభాన్‌పూర్‌లో మంగళవారం శివుడికి సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమం (religious event) జరిగింది.
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని హత్రాస్ (Hathras)లో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో తొక్కిసలాట (Stampede) జరిగింది. రతీభాన్‌పూర్‌లో మంగళవారం శివుడికి సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమం (religious event) జరిగింది. ఈ కార్యక్రమం ముగియగానే స్థానికులు ఒక్కసారిగా గుంపులు గుంపులుగా వెళ్లారు. దీంతో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో సుమారు 27 మంది ప్రాణాలు కోల్పోయారు. వంద మందికిపైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో మహిళలు, పిల్లలు ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఎటా మెడికల్ కాలేజీకి తరలించారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. Etah CMO ఉమేష్ కుమార్ త్రిపాఠి మాట్లాడుతూ, "ఇప్పటి వరకు 27 మృతదేహాలు పోస్ట్‌మార్టం హౌస్‌కు చేరుకున్నాయి, ఇందులో 25 మంది మహిళలు మరియు 2 పురుషులు ఉన్నారు. చాలా మంది గాయపడ్డారు కూడా. విచారణ తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
Here's Video
#WATCH | Etah, Uttar Pradesh: Several people have died in a stampede at a religious event in Hathras.
CMO Etah, Umesh Kumar Tripathi says, "27 bodies have arrived at the post-mortem house so far, including 25 women and 2 men. Many injured have also been admitted. Further details… pic.twitter.com/7tgZEQXHEe
— ANI (@ANI) July 2, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 02, 2024 04:49 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

