Veena George Car Accident: వయనాడ్ వెళ్తుండగా కేరళ ఆరోగ్య మంత్రి కారుకు ప్రమాదం, తృటిలో ప్రాణాల నుంచి బయటపడిన వీణా జార్జ్
కేరళ ఆరోగ్య మంత్రి (Kerala Health Minister) వీణా జార్జ్ (Veena George)తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. వయనాడ్‌కు వెళ్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి (road accident) గురైంది. ఈ ఘటనలో మంత్రి గాయాలతో బయటపడ్డారు.
కేరళ ఆరోగ్య మంత్రి (Kerala Health Minister) వీణా జార్జ్ (Veena George)తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. వయనాడ్‌కు వెళ్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి (road accident) గురైంది. ఈ ఘటనలో మంత్రి గాయాలతో బయటపడ్డారు. భారీ వర్షాల కారణంగా వయనాడ్ (Wayanad) జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని సందర్శించేందుకు మంత్రి ఇవాళ ఉదయం తన కారులో బయల్దేరారు. శవాల దిబ్బగా మారిన దేవుని సొంత దేశం, వయనాడ్ విలయంలో 158కి పెరిగిన మృతుల సంఖ్య, ఇంకా కానరాని 98 మంది జాడ
ఈ క్రమంలో మలప్పురం జిల్లాలో మంత్రి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మంజేరిలోని చెట్టియాంగడి వద్ద ఎదురుగా వస్తున్న స్కూటర్‌ను తప్పించబోయి కారు విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో మంత్రికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సిబ్బంది మంత్రిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మంత్రి వీణా జార్జ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
Here's News
Kerala Health Minister #VeenaGeorge's vehicle was involved in an accident in Malappuram on Wed. Both scooty rider and minister were admitted to Mancheri Hospital. Minister was travelling to the #Wayanad to take stock of rescue ops. #WayanadLandslide Pics: @ians pic.twitter.com/6lqBI0kdWm
— ETV Bharat (@ETVBharatEng) July 31, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 31, 2024 11:54 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

