యూట్యూబర్‌ శ్రీకాంత్‌రెడ్డిపై సినీ నటి కరాటే కల్యాణి దాడికి పాల్పడ్డారు. ప్రాంక్ వీడియోల పేరిట మహిళలతో అసభ్య వీడియోలు చేస్తున్నారంటూ అతనిపై దాడి చేశారు. యూసుఫ్‌గూడలోని ఓ బస్తీలో వీడియోలు చేస్తుండగా.. సినీ నటి కల్యాణి మరో ఇద్దరు కలిసి వచ్చి శ్రీకాంత్‌రెడ్డిపై దాడి చేశారు. తొలుత కరాటే కల్యాణి చెంప దెబ్బ కొట్టడంతో మొదలైన గొడవ క్రమంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకునే దాకా వెళ్లింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)