Dr NK Arora: దేశంలో కోవిడ్ వల్ల 47 లక్షల మంది మృతి చెందారనేది అబద్దం, డబ్ల్యూహెచ్‌వో నివేదికన తప్పుబట్టిన కోవిడ్ వర్కింగ్ గ్రూప్ చీఫ్ డాక్టర్ ఎన్‌కే అరోరా
భారతదేశంలో కోవిడ్ వల్ల 47 లక్షల మంది మరణించి ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ఓ రిపోర్ట్‌లో తెలిపింది. దీన్ని కోవిడ్ వర్కింగ్ గ్రూప్ చీఫ్ డాక్టర్ ఎన్‌కే అరోరా తప్పుపట్టారు. భారత్‌లో సంభవించిన మరణాలపై డబ్ల్యూహెచ్‌వో ఇచ్చిన నివేదికలో ఎటువంటి లాజిక్ కానీ వాస్తవం కానీ లేదన్నారు. ఆ నివేదిక ఆందోళన కలిగించేలా ఉందన్నారు.
భారతదేశంలో కోవిడ్ వల్ల 47 లక్షల మంది మరణించి ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ఓ రిపోర్ట్‌లో తెలిపింది. దీన్ని కోవిడ్ వర్కింగ్ గ్రూప్ చీఫ్ డాక్టర్ ఎన్‌కే అరోరా తప్పుపట్టారు. భారత్‌లో సంభవించిన మరణాలపై డబ్ల్యూహెచ్‌వో ఇచ్చిన నివేదికలో ఎటువంటి లాజిక్ కానీ వాస్తవం కానీ లేదన్నారు. ఆ నివేదిక ఆందోళన కలిగించేలా ఉందన్నారు. మరణాల విషయంలో ఉంటే 20 శాతం తేడా ఉంటుందేమో అని ఆయన అన్నారు.దేశంలో మరణ ధ్రువీకరణ విధానం పటిష్టంగా ఉందని, వైరస్ సంబంధింత మరణాలన్నీ నమోదు అయినట్లు ఆయన వెల్లడించారు. డబ్ల్యూహెచ్‌వో రిపోర్ట్ తప్పుడుగా ఉందని అరోరా అన్నారు.
దేశంలోని అన్ని రాష్ట్రాలు కొంత ఆలస్యంగా కోవిడ్ మరణాలను రిపోర్ట్ చేస్తున్నాయని, భారత్ చాలా పెద్ద దేశమని, ఒకవేళ మరణాల నమోదు తప్పినా.. అది డబ్ల్యూహెచ్‌వో చెప్పినట్లు 10 శాతం తేడా ఉండదని అరోరా అన్నారు. ఇండియా ఇచ్చిన డేటాను డబ్ల్యూహెచ్‌వో పట్టించుకోలేదని, తన సొంత గణాంకాలనే అది నమ్ముకున్నట్లు ఆయన చెప్పారు.
India 2020 Data "Corroborates"...: Expert Explains WHO Covid Deaths Report https://t.co/y4DafpS0ut pic.twitter.com/4IWhKXm70R
— NDTV (@ndtv) May 6, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 06, 2022 01:32 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

