YS Family's Property Dispute: ఒక ఆర్థిక నేరస్థుడు పదకొండేళ్లుగా బెయిల్‌పై ఉండటమేంటి ? జగన్ మీద యనమల సంచలన వ్యాఖ్యలు
తల్లి, చెల్లిపై కేసులేయడంతో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాతాళంలోకి పడిపోయారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఆయన చేయి పట్టుకున్నోళ్లంతా పాతాళంలోకే అని ఎద్దేవా చేశారు.
తల్లి, చెల్లిపై కేసులేయడంతో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాతాళంలోకి పడిపోయారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఆయన చేయి పట్టుకున్నోళ్లంతా పాతాళంలోకే అని ఎద్దేవా చేశారు. చివరికి జగన్ తన సొంత తల్లి, చెల్లిని కూడా మోసం చేశారని దుయ్యబట్టారు.
ఇది ఆస్తుల వివాదం కాదని, రాజకీయ ఆత్మహత్యేనని యనమల పేర్కొన్నారు. షర్మిలకు రూ.200 కోట్లు ఇచ్చానని జగన్ చెప్పినా... ఐటీ, ఈడీలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అసలు ఆయనకు ఈ రూ.200 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. ఈ సందర్భంగా జగన్‌పై యనమల కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక ఆర్థిక నేరస్థుడు పదకొండేళ్లుగా బెయిల్‌పై ఉండటమేంటని ప్రశ్నించారు. భవిష్యత్తులో జగన్ మళ్లీ అధికారంలోకి రావడం అనేది పగటి కలేనని చురకలంటించారు. పాత కేసులకు తోడు కొత్త కేసులు ఆయనపై సిద్ధంగా ఉన్నాయని, ఇవాళ కాకపోతే రేపైనా జగన్ జైలుకెళ్లడం ఖాయమని అన్నారు.
Here's Video
అవినీతి సొమ్ము పంపకాల్లో అన్యాయమా..!
రాజశేఖరెడ్డి పాలనలో అవినీతి సొమ్ము, జగన్ అక్రమ సంపాదన పంపకాల్లో తల్లి చెల్లికి అన్యాయం చేస్తున్నాడు..
జగన్ కు తల్లి చెల్లి కంటే అవినాష్ ఎక్కువై పోయాడు..
జగన్ అవినీతి పాలనతో రాష్ట్రానికి చెడ్డపేరు తెచ్చాడు..
ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి… pic.twitter.com/EVRrKSEHAR
— RTV (@RTVnewsnetwork) October 28, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 28, 2024 05:13 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

