Newdelhi, July 16: ప్రముఖ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) త్వరలో రాజకీయ ఆరంగేట్రం చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తన తల్లి, తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ సమాజ్ వాదీ పార్టీ (SP) తరపున ప్రయాగ్ రాజ్ (Prayagraj) స్థానం నుంచి ఎంపీగా (MP) పోటీచేయనున్నారని సమాచారం. అభిషేక్ తండ్రి అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) 1984లో ఇదే స్థానం నుంచి భారీ మెజారిటీతో ఎంపీగా గెలుపొందారు. ఇక అభిషేక్ తల్లి, సమాజ్‌వాదీ పార్టీ నేత జయాబచ్చన్ ప్రస్తుతం యూపీ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. దీంతో, అభిషేక్ ను కూడా రంగంలోకి దింపాలని ఎస్పీ అగ్రనేతలు తలపోస్తున్నట్టు తెలుస్తోంది.
Abhishek Bachchan To Contest Elections? Bollywood Actor May Enter Politics With SP Ticket From Prayagraj in Lok Sabha Election 2024 #AbhishekBachchan #LoksabhaElection2024 #SamajwadiParty https://t.co/YbpwEvFA0v
— LatestLY (@latestly) July 15, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)