Hyderabad, Sep 16: గణేష్‌ ఉత్సవాలకు (Ganesh celebrations) భాగ్యనగరం (Hyderabad) సిద్ధమౌతుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్‌ (Khairatabad) గణనాథుడు పూజలు అందుకోవడానికి సిద్ధమయ్యాడు. శిల్పి రాజేంద్రన్‌ కళ్లు దిద్దడంతో 63 అడుగుల ఎత్తైన భారీ గణనాథుడి తయారీ పనులు పూర్తయ్యాయి. రేపు ఉదయం ఉత్సవకమిటీ కర్రలను తొలగించనుంది. రెండ్రోజుల ముందే భక్తులకు భారీ గణనాథుడు దర్శనమివ్వనున్నాడు. ఈనెల 18న ఉదయం 10 గంటలకు గవర్నర్‌ తమిళిసై తొలి పూజలు నిర్వహించనున్నారు. కాగా, ఈసారి ఖైరతాబాద్‌ గణనాథుడు ప్రపంచంలోనే అతిపెద్ద గణేష్ గా రికార్డు సృష్టించడం విశేషం.

Hyderabad: కాంగ్రెస్‌లోకి తుమ్మల ఎంట్రీకి ముహుర్తం ఫిక్స్, సోనియా సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రెడీ అయిన మాజీ మంత్రి, స్వయంగా ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ ముఖ్యనేతలు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)