Brahmanandam: అంగరంగ వైభవంగా బ్రహ్మానందం చిన్న కుమారుడి వివాహం.. నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం కేసీఆర్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. వేడుకకు హాజరైన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు
ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం చిన్న కుమారుడు సిద్ధార్థ వివాహం శుక్రవారం హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. నగరానికి చెందిన డా. పద్మజ వినయ్‌ల కుమార్తె ఐశ్వర్యతో కలిసి సిద్ధార్థ వైవాహిక బంధంలో అడుగుపెట్టారు.
Hyderabad, Aug 19: ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం (Brahmanandam) చిన్న కుమారుడు సిద్ధార్థ వివాహం శుక్రవారం హైదరాబాద్ (Hyderabad) లో అంగరంగ వైభవంగా జరిగింది. నగరానికి చెందిన డా. పద్మజ వినయ్‌ల కుమార్తె ఐశ్వర్యతో కలిసి సిద్ధార్థ వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. అన్వయ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, సినీ నటులు నందమూరి బాలకృష్ణ, రామ్ చరణ్, మోహన్ బాబు తదితర సినీ రాజకీయ ప్రముఖులు కొత్త దంపతులను ఆశీర్వదించారు.
బ్రహ్మానందం కుమారుడు సిద్దార్థ పెళ్లికి హాజరైన తెలంగాణ సీఎం కేసీఆర్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, రామ్ చరణ్#Brahmanandam #KCR #Balakrishna #RamCharan pic.twitter.com/L9mNDepOgQ
— Telugu Scribe (@TeluguScribe) August 18, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 19, 2023 09:49 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

