Allu Arjun on Sandhya Theatre stampede: వీడియో ఇదిగో, నా అభిమాని చనిపోయిందని తెలిస్తే నేను వెళ్ళాలని అనుకొనా? లీగల్ ప్రాబ్లమ్స్ వల్ల కలవలేకపోయానని తెలిపిన అల్లు అర్జున్

లీగల్ ప్రాబ్లమ్స్ వల్ల కలవలేకపోయా. చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులు చనిపోతేనే నేను విజయవాడ, వైజాగ్ వెళ్లి వాళ్ళ కుటుంబాలను కలిశాను.అలాంటిది నా అభిమాని చనిపోయిందని తెలిస్తే నేను వెళ్ళాలని అనుకొనా? నేను వెళ్ళలేక తరువాత రోజు ఒక వీడియో ట్వీట్ చేశా..

Allu Arjun on Sandhya Theatre stampede: వీడియో ఇదిగో, నా అభిమాని చనిపోయిందని తెలిస్తే నేను వెళ్ళాలని అనుకొనా? లీగల్ ప్రాబ్లమ్స్ వల్ల కలవలేకపోయానని తెలిపిన అల్లు అర్జున్
Allu Arjun in Sandhya Theatre (photo-Video Grab)

తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ తదితరులు చేసిన తీవ్ర ఆరోపణల పట్ల టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తీవ్ర మనస్తాపంతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ రోజున జరిగింది అత్యంత దురదృష్టకరమైన సంఘటన అని వెల్లడించారు.ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడం తనను కలచివేసిందని, ఆమె కుటుంబానికి, ముఖ్యంగా ఆమె భర్తకు సంతాపం తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్లబ్బాయి శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు.

వీడియో ఇదిగో, పోలీసుల పర్మిషన్ ఇస్తే నాకు క్షణంలో ఆ పిల్లాడి దగ్గరికి వెళ్లాలని ఉంది, భావేద్వేగానికి గురైన అల్లు అర్జున్, మా నాన్న కూడా పోలీసుల దగ్గర గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్లాల్సి వచ్చిందంటూ..

లీగల్ ప్రాబ్లమ్స్ వల్ల కలవలేకపోయా. చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులు చనిపోతేనే నేను విజయవాడ, వైజాగ్ వెళ్లి వాళ్ళ కుటుంబాలను కలిశాను.అలాంటిది నా అభిమాని చనిపోయిందని తెలిస్తే నేను వెళ్ళాలని అనుకొనా? నేను వెళ్ళలేక తరువాత రోజు ఒక వీడియో ట్వీట్ చేశా.. దానికి నేను స్పందించలేదు అంటే ఎలా అని అల్లు అర్జున్ ప్రశ్నించారు.

Allu Arjun on Sandhya Theatre stampede: 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 21, 2024 10:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).