Andhra Pradesh: ఏపీలో రోడ్ల దుస్థితికి అద్దం పట్టే వీడియోలు ఇవిగో, రోడ్లు సరిగా లేకపోవడంతో డోలీలో నిండు గర్భిణిని, అనారోగ్యంతో ఉన్న వృద్ధుడిని ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు

మాడుగుల జాలంపల్లి పంచాయతీ శివారు సిరిపురం గ్రామానికి చెందిన చెదల వెంకటలక్ష్మికి బుధవారం సాయంత్రం పురిటి నొప్పులు వచ్చాయి. ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గ్రామస్తులు డోలీ కట్టి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న జాలంపల్లి వరకు తీసుకొచ్చారు.

Andhra Pradesh: ఏపీలో రోడ్ల దుస్థితికి అద్దం పట్టే వీడియోలు ఇవిగో, రోడ్లు సరిగా లేకపోవడంతో డోలీలో నిండు గర్భిణిని, అనారోగ్యంతో ఉన్న వృద్ధుడిని ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
Tribal People carried pregnant woman and Older Man in doli to Hospital (Photo-VIzag News)

మాడుగుల జాలంపల్లి పంచాయతీ శివారు సిరిపురం గ్రామానికి చెందిన చెదల వెంకటలక్ష్మికి బుధవారం సాయంత్రం పురిటి నొప్పులు వచ్చాయి. ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గ్రామస్తులు డోలీ కట్టి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న జాలంపల్లి వరకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి మాడుగుల సీహెచ్‌సీకి ఆటోలో తరలించారు. సుఖప్రసవం కావడంతో తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారు. మరో ఘటనలో అల్లూరి జిల్లా చింతపల్లిలో వర్షపు బురద రోడ్డులో డోలీలో గర్భిణీ లక్ష్మీని ఆసుపత్రికి తరలించగా, పాడేరు ప్రాంతంలో వృద్ధుడికి అనారోగ్యంతో డోలి కట్టి వాగు ప్రవాహం దాటించారు. అక్కడి నుంబి వారి కుటుంబీకులు వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు.

ఏపీలో ఇంకా అభివృద్ధికి దూరంగానే గ్రామాలు, నిండు గర్భిణికి నొప్పులు రావడంతో డోలీలోనే 6 కిలోమీటర్లు మోసుకువెళ్లిన బందువులు

Tribal People carried pregnant woman and Older Man in doli to Hospital

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 27, 2024 05:43 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).