పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో ఇన్‌స్టాగ్రామ్‌లో స్నానం చేస్తున్న వీడియో లైవ్ ఇచ్చాడు. అది సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఈ వీడియోలో రొనాల్డో బహిరంగంగా స్నానం చేయడం కనిపించింది. మాములుగానే రొనాల్డో ఏదైనా షేర్‌ చేస్తే విరగబడి చూసి అతని ఫ్యాన్స్‌.. లైవ్‌ వీడియో అంటే ఊరుకుంటారా. అయితే రొనాల్డో బహిరంగ స్నానం చూసి ఆశ్చర్యపోయినప్పటికి.. తమ ఆరాధ్య ఆటగాడు అలా కనిపించడంతో లైక్స్‌, కామెంట్స్‌ చేశారు. రొనాల్డో స్నానం చేస్తున్న సమయంలో దాదాపు 670,000 మంది లైవ్‌లో చూశారు. సూ.. లాఫింగ్‌ ఎమోజీలు.. జెండాలు ఇలా రకరకాల ఎమోజీలతో కామెంట్స్‌ చేస్తూ పోయారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్‌ కలిగిన వ్యక్తిగా రొనాల్డోకు పేరు ఉంది. ప్రస్తుతం మాంచెస్టర్ యునైటెడ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రొనాల్డో.. మాంచెస్టర్‌ సిటీతో కీలక మ్యాచ్‌కు ముందు ఈ లైవ్‌ వీడియోనూ షేర్‌ చేశాడు. రొనాల్డో ఇలా చేయడం వెనుక సరైన కారణం తెలియదు గానీ.. ఇప్పుడు అతని బహిరంగ స్నానం మాత్రం సోషల్‌ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)