Fire Accidents in Two Trains: ఈ ఉదయం రెండు రైళ్లలో అగ్ని ప్రమాదాలు.. బెంగళూరు రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న రైలులో మంటలు.. రెండు బోగీలు దగ్ధం.. తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో కూడా మంటలు
బెంగళూరులోని క్రాంతివీర సంగోలి రాయన్న (కేఎస్ఆర్) రైల్వే స్టేషన్ లో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్ లో హాల్ట్ చేసిన ఉదయన్ ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి.
Bengaluru, Aug 19: బెంగళూరు(Bengaluru)లోని క్రాంతివీర సంగోలి రాయన్న (కేఎస్ఆర్-KSR) రైల్వే స్టేషన్ లో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్ లో హాల్ట్ చేసిన ఉదయన్ ఎక్స్ ప్రెస్ (Udayan Express) రైలులో మంటలు చెలరేగాయి. దీంతో స్టేషన్ మొత్తం పొగ నిండిపోయి గందరగోళం నెలకొంది. ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. రైల్వే సిబ్బంది సమాచారంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు అందరూ క్షేమంగానే ఉన్నారని రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణమేంటనే విషయంపై విచారణ జరిపిస్తున్నట్లు తెలిపారు. అటు తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో కూడా ఈ ఉదయం మహారాష్ట్ర నాగ్ పూర్ దగ్గర ఎస్-2 బోగీలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులు అందరూ క్షేమంగానే ఉన్నారని రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు.
A fire broke out in Mumbai-Bengaluru Udyan Express two hours after it arrived at its destination station, railway officials said.https://t.co/0ZlglJmBsR
— Hindustan Times (@htTweets) August 19, 2023
Telangana Express | తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. నాగ్‌పూర్‌లో నిలిచిన రైలుhttps://t.co/YocCrZDlhg
— Namasthe Telangana (@ntdailyonline) August 19, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 19, 2023 10:50 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

