Newdelhi, Jan 21: హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) రాజధాని సిమ్లా (Shimla) సమీపంలో శనివారం ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా పేకమేడలా నేలకొరిగింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు (Heavy Rains), వరదలకు (Floods) కొండచరియలు విరిగిపడ్డాయి. రాళ్లు ఈ భవనం గోడలను బలంగా ఢీకొట్టాయి. ఈ క్రమంలో ఇంటిని మరమ్మతు చేయించేందుకు యజమాని రాజ్ కుమార్ అందరినీ ఖాళీ చేయించాడు. ఇది జరిగిన కాసేపట్లోనే భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో తృటిలో పెను ప్రమాదం తప్పినట్లయింది.
हिमाचल प्रदेश के पर्यटन स्थल शिमला से लगभग 20 किमी दूर धामी में दोपहर में अचानक 5 मंजिला बिल्डिंग भर-भराकर गिरी।
इस बिल्डिंग में लॉ कुछ स्टूडेंट्स रहते थे, लेकिन एक हफ्ते पहले दरार आने पर बिल्डिंग खाली करा ली गई थी।#Shimla #HimachalPradesh pic.twitter.com/IoFvKiQYmw
— विवेक यादव (@vvkydvtalks) January 20, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)