Train Viral Video: వృద్ధుడి మీద నుంచి వెళ్లిన రైలు.. అయినప్పటికీ, అతనికి ఏమీ కాలేదు.. ఎందుకు? ఇదిగో వైరల్ వీడియో

బీహార్ లో ఓ వృద్ధుడు తన పైనుంచి రైలు వెళ్లినా ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. అసలు ఏమైందంటే??

Train Viral Video: వృద్ధుడి మీద నుంచి వెళ్లిన రైలు.. అయినప్పటికీ, అతనికి ఏమీ కాలేదు.. ఎందుకు? ఇదిగో వైరల్ వీడియో
Credits: Twitter

Gaya, June 19: బీహార్ (Bihar) లో ఓ వృద్ధుడు తన పైనుంచి రైలు (Train) వెళ్లినా ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో (Video) వైరల్ (Viral) గా మారింది. అసలు ఏమైందంటే?? గయా (Gaya) జిల్లా ఫతేపుర్‌ మండలంలోని మోర్‌హే గ్రామానికి చెందిన బాలో యాదవ్‌ (70) పహాడ్‌పుర్‌ రైల్వేస్టేషనులో పట్టాలు దాటబోయాడు. ఇంతలో స్టేషనులో నిలిచి ఉన్న గూడ్స్‌ రైలు అకస్మాత్తుగా కదిలింది. దీన్ని గమనించిన ప్రయాణికులు పట్టాలపై పడుకోమని వృద్ధుడికి వినిపించేలా కేకలు వేశారు. వెంటనే అప్రమత్తమైన బాలో యాదవ్‌ ఏమాత్రం తడబాటు లేకుండా పట్టాలపై పడుకున్నాడు. రైలు వెళ్లిపోయేదాకా అలాగే ఉన్నాడు. అనంతరం కర్ర సహాయంతో లేచి ఏమీ జరగనట్లు వెళ్లిపోయాడు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

28 Trains Cancelled: ఏపీ, తెలంగాణ సహా పలు ప్రాంతాలకు ప్రయాణించే ప్యాసింజర్లు అలెర్ట్.. వారం రోజులపాటు 28 రైళ్ల రద్దు.. 23 ఎంఎంటీఎస్ రైళ్లు కూడా రద్దు.. ట్రాక్ నిర్వహణ పనుల నేపథ్యంలోనే నిర్ణయం

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jun 19, 2023 09:54 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).