Gwalior Shocker: దారుణం, పెళ్లికి ఒప్పుకోలేదని కూతురిని పోలీసుల ఎదుటే కాల్చి చంపిన తండ్రి, ప్రేమించిన ప్రియుడినే చేసుకుంటానని కూతురు చెప్పడంతో కోపం పట్టలేక..
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తను గుర్జార్ అనే 20 ఏళ్ల యువతి పెళ్లికి నాలుగు రోజుల ముందు, నిశ్చితార్థం చేసుకున్న వివాహాన్ని వ్యతిరేకించడంతో ఆమె తండ్రి మహేష్ గుర్జార్ ఆమెను కాల్చి చంపారు. మంగళవారం సాయంత్రం పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన జరిగింది.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తను గుర్జార్ అనే 20 ఏళ్ల యువతి పెళ్లికి నాలుగు రోజుల ముందు, నిశ్చితార్థం చేసుకున్న వివాహాన్ని వ్యతిరేకించడంతో ఆమె తండ్రి మహేష్ గుర్జార్ ఆమెను కాల్చి చంపారు. మంగళవారం సాయంత్రం పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. తన కుటుంబసభ్యులు తనను పెళ్లికి బలవంతం చేశారని, తనకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ తనూ అనే యువతి అదేరోజు సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది.
ఆమె తన భాగస్వామి భికం "విక్కీ" మావాయిని వివాహం చేసుకోవాలనే తన కోరికను వీడియోలో వ్యక్తం చేసింది, అతనితో ఆమె ఆరు సంవత్సరాల నుండి సంబంధం కలిగి ఉన్నట్లు కూడా తెలిపింది. ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్ కు చేరింది. పోలీసుల మధ్యవర్తిత్వంలో తండ్రి మహేష్ తన కూతురు తనూతో ఏకాంతంగా మాట్లాడాలని అభ్యర్థించాడు.
పోలీసులు అందుకు అంగీకరించడంతో ఏకాంతంగా మాట్లాతుండగానే తండ్రి ఆమెను చాలా దగ్గరి నుండి కాల్చాడు. ఆమె బంధువు రాహుల్ సహాయంతో అనేక సార్లు కాల్చాడు. దీంతో తనూ అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రి మహేశ్‌ను అరెస్టు చేసి కాల్చిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంధువు రాహుల్ పరారీలో ఉన్నాడు. ఈ కేసుపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు తనూ యొక్క సోషల్ మీడియా ఖాతాలను సమీక్షిస్తున్నారు.
Madhya Pradesh Father Kills Daughter in Front of Cops
Gwalior : पिता ने गोली मारकर की बेटी की हत्या, 18 जनवरी को थी बेटी की शादी#Gwalior #MPNews #ZeeMPCG
For More Updates: https://t.co/P88PaoupXm pic.twitter.com/SCaT6I0oUt
— Zee MP-Chhattisgarh (@ZeeMPCG) January 15, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 15, 2025 02:59 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

