దేశం పేరును ‘ఇండియా’ నుంచి ‘భారత్‌’గా కేంద్ర ప్రభుత్వం మారుస్తుందనే వార్తలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ (Lalu Yadav’s old video) గతంలో ‘ఇండియా, భారత్‌’ మధ్య వ్యత్యాస్యం గురించి మాట్లాడారు. ఈ పాత వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ వేప పుల్లతో పళ్లు తోముకుంటారు. ఈ సందర్భంగా ఆయనను ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్‌, మీరు ఎప్పుడైనా టూత్‌ బ్రష్‌ ఉపయోగించారా? అని ప్రశ్నించారు. దీనికి లాలూ తనదైన స్టైల్లో సమాధానమిచ్చారు. తాను ఢిల్లీలో మాత్రమే టూత్‌ బ్రష్‌తో పళ్లు తోముకుంటానని తెలిపారు.

ఢిల్లీని ‘ఇండియా’గా పేర్కొన్న ఆయన అక్కడ వేప పుల్లలు అంత సులువుగా లభించవని అన్నారు. అయితే బీహార్‌ రాజధాని పాట్నాను ‘భారత్‌’గా అభివర్ణించిన లాలూ, ఇక్కడ మాత్రం వేప పుల్లలు విరివిగా దొరుకుతాయని చెప్పారు.లాలూ గతంలోనే ‘భారత్‌’కు మద్దతుగా మాట్లాడారని కొందరు ఈ వీడియోలో వ్యాఖ్యానించారు.

Lalu Yadav's Old Video Goes Viral

Here's Viral Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)