జార్ఖండ్ రాష్ట్రంలో 16 ఏండ్ల యువ‌కుడు ప‌శువులా ప్ర‌వ‌ర్తించాడు. త‌న ప్రేయ‌సిని పంట పొలాల్లోకి తీసుకెళ్లి చిత్రహింస‌ల‌కు గురి చేశాడు. ఆ విద్యార్థినిని త‌న కాళ్ల‌తో ఘోరంగా తంతూ పరుగెత్తించాడు. ఈ ఘ‌ట‌న జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో వెలుగు చూసింది. బాధితురాలు కింద ప‌డిపోయినా క‌నిక‌రం చూప‌కుండా.. ఆమెపై విరుచుకుప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న‌ను యువ‌కుడి స్నేహితులు రికార్డ్ చేసి సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ చేశారు. ఈ ఘ‌ట‌న 15 రోజుల క్రితం జ‌రిగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. యువ‌కుడు తొమ్మిదో త‌ర‌గ‌తి చదువుతున్న‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల జార్ఖండ్ ముఖ్య‌మంత్రి హేమంత్ సోరెన్ సీరియ‌స్‌గా స్పందించారు. బాలిక ప‌ట్ల దారుణంగా ప్ర‌వ‌ర్తించిన యువ‌కుడిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసుల‌కు సీఎం సూచించారు. దీంతో ఆ యువ‌కుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు త‌ర‌లించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)