పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన కోటి రూపాయల కోడి పందెలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాడేపల్లిగూడెంలోని పైబోయిన వెంకట్రామయ్య ఈ పందెం నిర్వహించారు.ఈ పందెంలో గుడివాడ ప్రభాకర్ రావు నెమలి పుంజు, రత్తయ్య రసంగి పుంజు పోటీపడ్డాయి. రూ.1.25 కోటి ప్రైజ్ మనీతో ఈ పందెంకోళ్లను బరిలోకి దింపారు.హోరాహోరీగా పందెం జరగ్గా.. ఈ కోడిపందెం చూడటానికి భారీగా జనం తరలివచ్చారు. అలాగే కోడిపుంజులపై కూడా భారీగా బెట్టింగ్ జరిగింది. చివరాఖరికి ఈ కోటి 25 లక్షల రూపాయల పందెంలో గుడివాడ ప్రభాకర్‌కు చెందిన నెమలి పుంజు విజేతగా నిలిచింది.కాగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీలో భారీగా కోడిపందేలు జరిగాయి. కోట్లల్లో చేతులు మారాయి.
One Crore Rupees Cockfight in Tadepalligudem west Godavari
కోటి రూపాయల కోడి పందెం..
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కోటి 25 లక్షలతో కోడి పందెం
నెమలి పుంజు, రసంగి పుంజులను దింపిన గుడివాడ ప్రభాకర్ రావు, రాతయ్య
హోరాహోరీగా సాగిన పందెంలో గుడివాడ ప్రభాకర్ కు చెందిన నెమలి పుంజు గెలుపు
కోటి రూపాయల కోడి పందాన్ని వీక్షించేందుకు భారీగా… pic.twitter.com/qaM3geZfXQ
— Telangana Awaaz (@telanganaawaaz) January 15, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)