Hyderabad, May 28: పుట్టబోయేది అమ్మాయని తెలిసి గర్భంలోనే చిదిమేస్తున్న ఘటనలు నిత్యకృత్యమైన వేళ..  లేక లేక కలిగిన ఆడపిల్లను (Girl Child) ఏనుగుపై (Elephant) ఊరేగించింది ఓ కుటుంబం. మహారాష్ట్రలోని (Maharastra) కొల్హాపూర్ జిల్లా పచ్‌గావ్‌లో జరిగిందీ ఘటన. గ్రామానికి చెందిన గిరీశ్ పాటిల్‌కు (Gireesh Patil) ఐదు నెలల క్రితం పాప పుట్టింది. ఆ వంశంలో అమ్మాయి పుట్టడం 35 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. దీంతో ఆ ఇంట ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. పాపకు ‘ఐరా’ అని పేరు పెట్టారు.  చిన్నారిని ఇటీవల ఇంటికి తీసుకురాగా దానిని ఎప్పటికీ గుర్తుండిపోయే మధురానుభూతిగా మార్చుకున్నారు. ఐరాను ఏనుగుపై ఊరేగిస్తూ డబ్బు వాయిద్యాల మధ్య గిరీశ్ తన ఇంటికి తీసుకెళ్లాడు. ఈ వేడుకను తిలకించేందుకు ఊరు ఊరంతా కదిలి వచ్చింది.

Sharwanand: రోడ్డు ప్రమాదంలో హీరో శర్వానంద్‌కు గాయాలు.. అసలేమైంది??

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)