Mumbai, Feb 3: ఒక పావురం (Pigeon) ఎనిమిది నెలలుగా పోలీస్ కస్టడీలో (Police Custody) ఉన్నది. గూఢచర్యం ఆరోపణలపై దర్యాప్తు చేసిన పోలీసులు ఎట్టకేలకు దానిని విడిచిపెట్టారు. (Pigeon Probed) మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. ముంబై పోర్టు వద్ద ఇటీవల కనిపించిన ఒక పావురం రెక్కలపై చైనా భాషలో రాసిన సందేశాలు ఉన్నాయి. ఆ పావురం ద్వారా చైనా గూఢచర్యం చేస్తున్నట్లు అనుమానించిన పోలీసులు దానిని పట్టుకున్నారు. ఆ పక్షిపై గూఢచర్యం కింద కేసు నమోదు చేశారు. గత ఎనిమిది నెలలుగా వెటర్నరీ హాస్పిటల్ వద్ద పంజరంలో ఆ పావురాన్ని ఉంచి తాళం వేశారు. ఆ పక్షి గూఢచర్యానికి పాల్పడిందా అన్న దానిపై దర్యాప్తు చేశారు. చివరకు విడుదల చేశారు.
Pigeon suspected of spying for Chinese released after 8 months: Mumbai police https://t.co/lUSjquP8La via @deccanherald
— Rex Arun Stanley 🇵🇸 (@iRexArunStanley) January 31, 2024
View this post on Instagram
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)