Viral Video: వీడియో ఇదిగో, ప్రియురాలి ఉద్యోగం కోసం అమ్మాయిగా మారిన ప్రియుడు, బయోమెట్రిక్ డివైస్ దగ్గర దొరికిపోవడంతో బండారం బయటకు..

పంజాబ్ రాష్ట్రంలో ఓ యువకుడు ప్రేయసి కోసం ఎవరూ చేయలేని సాహసమే చేసి.. చిక్కుల్ని కొని తెచ్చుకున్నాడు. నవరి 7వ తేదీన బాబా ఫరీద్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ ఆరోగ్య సిబ్బంది నియామకాల కోసం పరీక్ష నిర్వహించింది

Viral Video: వీడియో ఇదిగో, ప్రియురాలి ఉద్యోగం కోసం అమ్మాయిగా మారిన ప్రియుడు, బయోమెట్రిక్ డివైస్ దగ్గర దొరికిపోవడంతో బండారం బయటకు..
Punjab Man Dressed As His Girlfriend To Write Exam On Her Behalf, Caught (photo-X/@Cow__Momma

Punjab Man Dressed As His Girlfriend To Write Exam: పంజాబ్ రాష్ట్రంలో ఓ యువకుడు ప్రేయసి కోసం ఎవరూ చేయలేని సాహసమే చేసి.. చిక్కుల్ని కొని తెచ్చుకున్నాడు. నవరి 7వ తేదీన బాబా ఫరీద్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ ఆరోగ్య సిబ్బంది నియామకాల కోసం పరీక్ష నిర్వహించింది. ఫజిల్కా ప్రాంతానికి చెందిన అంగ్రేజ్‌ సింగ్‌ అనే యువకుడు.. తన ప్రేయసి పరంజిత్‌ కౌర్‌ బదులు ఆ పరీక్ష రాయాలకున్నాడు. అమ్మాయిల వస్త్రధారణతో పరీక్ష హాల్‌కు వెళ్లాడు.

లేడీస్‌ సూట్ వేసుకుని‌, ఎరుపురంగు గాజలు ధరించి, నుదుట తిలకం పెట్టుకుని, పెదాలకు లిప్‌స్టిక్‌ రాసుకుని అచ్చం అమ్మాయిలా తయారై వచ్చేసరికి ఎవరూ గుర్తించలేకపోయారు. పరీక్ష మొదలైంది. అమ్మాయి వేషధారణలో దిగిన ఫొటోతో తన గర్ల్‌ఫ్రెండ్‌ పరంజీత్‌ కౌర్ పేరిట తయారు చేయించుకున్న నకిలీ గుర్తింపు కార్డులను కూడా అధికారులు పసిగట్టలేకపోయారు.

ఇన్విజిలేటర్‌ ఒక్కొక్కరి దగ్గర బయోమెట్రిక్‌ తీసుకుంటూ అంగ్రేజ్‌ సింగ్‌ దగ్గరకు వచ్చాడు. అంగ్రేజ్‌ సింగ్‌ వేలిముద్రలు అసలు క్యాండిడేట్ పరంజీత్‌ కౌర్‌ వేలిముద్రలు వేరు కావడంతో సరిపోలలేదు.దాంతో అనుమానం వచ్చి తనిఖీ చేయడంతో తను అమ్మాయి వేషంలో వచ్చిన అబ్బాయి అని తేలింది. అది చూసి ఆ హాల్లో పరీక్ష రాస్తున్న మిగతా అభ్యర్థులతో పాటు ఇన్విజిలేటర్‌లు, అధికారులు నవ్వాపుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అంగ్రేజ్‌ను పోలీసులకు అప్పగించారు. పరంజీత్‌ అభ్యర్థిత్వాన్ని రద్దు చేశారు.అక్కడితో ఆగకుండా అతనిపై చట్టపరమైన చర్యలకు యూనివర్సిటీ అధికారులు సిద్ధమవుతున్నారు.

Here's Pics

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 15, 2024 03:26 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).